ETV Bharat / state

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు - గుంటూరు జిల్లా ముఖ్యంశాలు

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలోని మయూరి కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాముల్లో వేస్ట్ కాటన్ బేళ్లు నిల్వ ఉన్న ప్రాంతంలో... పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

మంటలను అదుపు చేస్తున్న అగ్ని మాపక సిబ్బంది

author img

By

Published : Mar 30, 2021, 10:21 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం మయూరి కాటన్ మిల్లులో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. గోదాముల్లోని వేస్ట్ కాటన్ బేళ్ళు నిల్వ ఉంచిన చోట.. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలను అదుపు చేస్తున్నారు.

రాత్రి వేళ ఇబ్బంది లేకుండా ఆస్కా లైట్ ను ఉపయోగించి మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మయూరి కాటన్ మిల్స్ యాజమాన్యం అందుబాటులో లేదు. ప్రమాదం ఎలా జరిగింది, ఎంత నష్టం వాటిల్లిందనే వివరాలు అనేది ఇంకా తెలియదని అగ్నిమాపక అధికారి చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారని వెల్లడించారు.

ఇదీ చదవండి:

మయన్మార్​లో పట్టుబడిన తలనీలాలతో మాకు సంబంధం లేదు: తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.