FIRE ACCIDENT IN TS NEW SECRETARIAT : తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. వుడ్ వర్క్ జరుగుతున్న క్రమంలో మంటలు చెలరేగినట్లు పోలీసుల సమాచారం. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ చదవండి: