గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. వరిగడ్డితో వస్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లా నుంచి కొల్లిపర్లకు.. శ్రీనివాసరావు అనే వ్యక్తి ట్రాక్టర్లో వరిగడ్డి తీసుకొస్తున్నారు.ట్రాక్టర్ చక్రాయపాలెనికి సమీపించగానే ఆ గడ్డికి విద్యుత్ తీగలు రాజుకుని నిప్పురవ్వలు చెలరేగాయి. గడ్డి పై పడటంతో మంటలు చుట్టుముట్టాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న ఫలించలేదు. గడ్డితో పాటు ట్రాక్టర్ ముందుభాగం కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసి.. ట్రాక్టర్ ట్రక్కును మంటల నుంచి కాపాడారు. సుమారు రూ. లక్షా 80వేల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
ఎస్కార్ట్ వాహనం మీదకు దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు పోలీసులు మృతి