గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న శివస్వాతి(ఎల్సీడీ) పత్తి మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాములో మంటలు ఎగిసి పడుతున్న విషయాన్ని గుర్తించిన కాపలాదారుడు యజమానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. వారితో పాటు స్థానికంగా పత్తి మిల్లులో ఉన్న వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో గోదాముల్లో నిల్వ ఉంచిన సుమారు 2 వేల డీలింట్ పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. ఆస్తి నష్టం రూ.50 లక్షల వరకు ఉండవచ్చనని అంచనా వేస్తున్నారు. కాగా పత్తిమిల్లు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుది.
ఇదీచదవండి