గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం.. చెరువు రహదారిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష రూపాయలు విలువచేసే తాగునీటి లైన్ పైపులు దగ్ధమయ్యాయి. చెరువు వద్ద నుంచి పురుషోత్తమపట్నం వరకు అమృత పథకంలో భాగంగా.. పైప్ లైన్ నిర్మాణ పనులను మేగా సంస్థ నిర్వహిస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: 'విద్యార్థులు, వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు'