గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్తు తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు చెలరేగి… గడ్డి వాములకు అంటుకుంది. భారీగా గాలి వీచిన కారణంగా... మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు నీళ్లు పోస్తూ.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసేందుకు మూడు గంటలు శ్రమించారు.
ఈ ఘటనలో గ్రామానికి చెందిన పెద్ది వెంకటరావు, చెన్నుపాటి సింగయ్యలకు చెందిన 2 గడ్డివాములు, 2 పశువుల పాకలు దగ్ధమయ్యాయి. సుమారు రెండు లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. విద్యుత్ తీగలు తొలగించాలని అనేక సార్లు సంబంధిత శాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు. విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
ఇదీ చదవండి: