గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి రొయ్యల చెరువులకు నీరు పెట్టేందుకు తండ్రి వెంకట సుబ్బారావు(63), కొడుకు నాగార్జునరావు(40) రాత్రి 10 సమయంలో వెళ్లారు. నీరు పెడుతుండగా విద్యుత్ షాక్కు గురై ఇద్దరూ మృతి చెందారు. అడవులదివిగ గ్రామం హరిజనవాడలోని ఎం.పి.పి. పాఠశాలలో ఉపాధ్యాయునిగా నాగార్జునరావు పనిచేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
నీళ్లు పెట్టేందుకు వెళ్లి.. తండ్రీ కొడుకుల మృతి - nijampatnam mandal
రొయ్యల చెరువుకు నీళ్లు పెట్టేందుకు తండ్రీ కొడుకులు బయలు దేరారు. కానీ అదే వారికి చివరి రాత్రని ఊహించలేక పోయారు. విద్యుదాఘాతంతో ఇద్దరూ మృతి చెందారు. ఒకేసారి ఇద్దరు మరణించడం వల్ల కుటుంబం శోకసంద్రంలో మునిగింది.