Farmers Innovative Protest as Amaravati Movement Completes Four Years: రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా తుళ్లూరు ధర్నా శిబిరం వద్ద జెండావందనం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలని కోరుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో కలిసి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అమరావతి ఉద్యమ అమరవీరులకు రైతులు, మహిళలు నివాళులర్పించారు.
ఉద్యమం నాలుగేళ్లు పూర్తైనా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి మేలుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయపక్షాలకు చెందిన ప్రతినిధులు, న్యాయవాదులు తరలివచ్చి అమరావతి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించేవరకూ తమ ఉద్యమం ఎన్నాళైనా కొనసాగుతుందని రైతులు, మహిళలు స్పష్టంచేశారు.
రాజధాని రైతులపై ప్రభుత్వం ప్రతీకార చర్యలు - నాలుగేళ్లలో 3 వేల మందిపై కేసులు
Nara Lokesh Supports Amaravati Farmers Protests: నాలుగేళ్లుగా నిర్విరామంగా రాజధాని రైతులు చేస్తున్న నిరసనలకు (Amaravati farmers protest) నారా లోకేశ్ మద్దతు తెలిపారు. మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని సైకో జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లైందని ధ్వజమెత్తారు. వేల కోట్ల విలువైన భవనాలు శిథిలం చేసి భూములు ఇచ్చిన రైతుల్ని దారుణ హింసలు పెట్టాడని మండిపడ్డారు. ఇన్ని చేసినా రాజధానిని అమరావతిని ఇంచు కూడా కదపలేకపోయారన్నారు. సైకో జగన్ అరాచక పాలన మరో మూడు నెలల్లో పోతుందని రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందన్నారు.
మూడు ముక్కలాటతో ప్రజారాజధాని నాశనం - జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు: లోకేశ్
Four Years Completed for Amaravati Farmers Protests: కాగా అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తింది. రాజధాని రైతులు, మహిళల ఉద్యమం 1461వ రోజుకు చేరింది. 2019లో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, మహిళలు నిరసన చేపట్టారు. రాజధాని చూట్టూ ఉన్న 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు వెలశాయి. నాలుగేళ్లుగా రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. రోజూ దీక్షా శిబిరాలకు వచ్చి రైతులు, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపతూనే ఉన్నారు.
నమ్మకద్రోహానికి నాలుగేళ్లు - రాష్ట్ర అభివృద్ధిని తలకిందులు చేసిన నిర్ణయం
ఉద్యమం చేపట్టి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా రైతులు పలు రకాల వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అమరావతినే రాజధానిగా చేసి ఇక్కడే అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసనగా దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం జెండా వందనం కార్యక్రమం నిర్వహించి, ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించి, సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు.