గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో రైతు చైతన్య యాత్రలో గందరగోళం నెలకొంది. ఆర్మూరు మిర్చి విత్తనాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కాకుండా వేరే వారికి ఇవ్వడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీకి చెందిన నాయకులకు విత్తనాలను అమ్ముకోవడం ఏమిటని వ్యవసాయాధికారి విజయ్ రాజును రైతులు నిలదీశారు.
విత్తనాల ప్యాకెట్లు తుమ్మలపాలెం రైతు భరోసా కేంద్రానికి రానీయకుండా ప్రత్తిపాడులో ఏవో దగ్గర ఉంచుకుని నాయకులకు ఇచ్చారని రైతులు ఆరోపించారు. అధికారులే ఇలా చేస్తే...ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రంలో ఇష్టానుసారం మిర్చి విత్తనాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. రైతులకు మేలు చేయని రైతు భరోసా కేంద్రాలు ఎందుకని ప్రశ్నించారు. రైతులకు సరైన సమాధానం చెప్పకుండా ఏవో విజయ్ రాజు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏవో తప్పు చేసినందుకే సమాధానం చెప్పకుండా పారిపోయారని రైతులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి