గుంటూరు జిల్లా తెనాలిలోని కివిరాజా పార్కులో అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో శారద జయంతిని నిర్వహించారు. శారద పేరుతో లబ్దప్రతిష్టులైన తమిళనాడుకు చెందిన రచయిత ఎస్ నటరాజన్... తన కథలు, లేఖలు, పాటలు, అనువాద రచనల ద్వారా సాహిత్య విశారద అయ్యారని జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శారద తెనాలి వచ్చి... ఇక్కడున్న సాంస్కృతిక వాతావరణాన్ని పునికిపుచ్చుకుని, తెలుగు నేర్చుకుని అద్భుతమైన రచనలు చేశారన్నారు. చిన్న వయసులోనే వివాహమై భర్తలను కోల్పోయిన ఎందరో మహిళల ఆవేదన తన రచనల ద్వారా లోకానికి చాటి చెప్పి... వారి గొంతుక అయ్యారన్నారు. ఆయన కథల్లో కొన్ని ఎంఏ కోర్సుల్లో పాఠ్యాంశాల్లో ఉన్నాయని... అలాగే ఇంటర్మీడీయట్ తెలుగు సబ్జెక్టులో పాఠంగా ఉండటం చాలా గర్వించదగ్గ విషయమన్నారు.
'ఆయన రచనలు నేటి యువతకు పాఠాలు' - writer sharada birth anniversary celebrations at tenali
గుంటూరు జిల్లా తెనాలి కవిరాజా పార్కులో... అ.ర.సం. ఆధ్వర్యంలో రచయిత శారద జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా అరసం ప్రచురించిన శారద సాహిత్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.
!['ఆయన రచనలు నేటి యువతకు పాఠాలు' famous writer sharada birth anniversary celebrations at tenali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6262150-828-6262150-1583122777618.jpg?imwidth=3840)
గుంటూరు జిల్లా తెనాలిలోని కివిరాజా పార్కులో అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో శారద జయంతిని నిర్వహించారు. శారద పేరుతో లబ్దప్రతిష్టులైన తమిళనాడుకు చెందిన రచయిత ఎస్ నటరాజన్... తన కథలు, లేఖలు, పాటలు, అనువాద రచనల ద్వారా సాహిత్య విశారద అయ్యారని జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శారద తెనాలి వచ్చి... ఇక్కడున్న సాంస్కృతిక వాతావరణాన్ని పునికిపుచ్చుకుని, తెలుగు నేర్చుకుని అద్భుతమైన రచనలు చేశారన్నారు. చిన్న వయసులోనే వివాహమై భర్తలను కోల్పోయిన ఎందరో మహిళల ఆవేదన తన రచనల ద్వారా లోకానికి చాటి చెప్పి... వారి గొంతుక అయ్యారన్నారు. ఆయన కథల్లో కొన్ని ఎంఏ కోర్సుల్లో పాఠ్యాంశాల్లో ఉన్నాయని... అలాగే ఇంటర్మీడీయట్ తెలుగు సబ్జెక్టులో పాఠంగా ఉండటం చాలా గర్వించదగ్గ విషయమన్నారు.
ఇదీ చదవండి: ఏపీలో మూడేళ్లలో 4.95 లక్షల వృక్షాల నరికివేత