ETV Bharat / state

దిశ పోలీస్ స్టేషన్​లోనే మహిళపై సీఐ దాడి - గుంటూరు దిశ పోలీస్ స్టేషన్

మహిళలకు భద్రత కల్పించే దిశ పోలీస్ స్టేషన్​లోనే ఓ మహిళపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని దిశ పోలీస్ట్ స్టేషన్ జరిగింది. షాజిదా అనే మహిళ సోదరి కేసు గురించి స్టేషన్​కు వస్తే తనపై సీఐ ఉస్మాన్ దాడి చేశాడని ఆరోపించింది. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

family complaint against ci for harresing her in guntur disha police station
దిశ పోలీస్ స్టేషన్​లోనే మహిళపై సీఐ దాడి
author img

By

Published : Aug 8, 2020, 11:56 AM IST

గుంటూరు జిల్లాలోని దిశ పోలీస్ట్ స్టేషన్ వద్దే ఓ సీఐ తనపై దాడి చేశడని ఓ మహిళ ఫిర్యాదు చేయటం కలకలం రేపింది. తెనాలిలోని చెంచుపేటకు చెందిన ఒక మహిళ భర్త ఉస్మాన్... కౌంటర్ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అతను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేస్తుండటంతో...బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అధికారులు కేసు నమోదు చేయకుండా సదరు కానిస్టేబుల్ ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. కేసుకు సంబంధించి పురోగతి లేకపోవటం, కానిస్టేబుల్ సోదరుడితో పాటు మరికొందరు బంధువులు పోలీసుశాఖలో పనిచేస్తుండటంతో తమకు న్యాయం జరగదని మహిళ కుటుంబసభ్యులు భావించారు.

కేసు పురోగతి తెలుసుకునేందుకు బాధితురాలి కుటుంబసభ్యులు గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అదే సమయంలో సదరు కానిస్టేబుల్ తో పాటు అతని సోదరుడైన సీఐ ఉస్మాన్, మరికొందరు బంధువులు కూడా స్టేషన్ బయట కనిపించారు. వారంతా పోలీసు శాఖలో పనిచేస్తున్నవారే. అంతా కలిసి కేసుని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారనే అనుమానంతో మహిళ సోదరి షాజిదా వారి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించడంతో... అగ్రహించిన సీఐ ఉస్మాన్, ఇతర బంధువులు షాజిదాపై దాడి చేశారు. ఒక్కసారిగా షాక్​కు గురైన షాజిదా, కుటుంబ సభ్యులు సదరు సీఐపైనా దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన సోదరికి న్యాయం చేయటంతో పాటు తనపై దాడికి పాల్పడ్డ సీఐ ఉస్మాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:
విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్​పై లైంగిక వేధింపుల ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.