పొలంలో వేసిన విత్తనాలు నకిలీవని తెలిసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ మకిలీతో పంట చేతికి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా సిరిపురం మిరప రైతులు. యూఎస్ త్రీ ఫోర్ వన్ అనే మిరప రకం సాగు చేశామని... మెుదట పంట మామూలుగానే ఎదిగినా... తర్వాత ఆకుముడత వచ్చి ఎదుగుదల ఆగిపోయిందని చెబుతున్నారు.
పూత, పిందే రావటంలేదని ఎన్ని మందులు పిచికారి చేసినా ప్రయోజనం లేదని వాపోయారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశామని చెప్పారు. ఇలా నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'మా పోరాటానికి సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలి'