ETV Bharat / state

ముఖ ఆధారిత హాజరు నమోదు కోసం.. గూగుల్ ప్లే స్టోర్​లో యాప్​

face recognition App on Google Play Store: గూగుల్ ప్లే స్టోర్​లో ముఖ ఆధారిత హాజరు నమోదు కోసం ప్రభుత్వం కొత్త యాప్​ను తీసుకువచ్చింది. ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉద్యోగులకు ఆదేశాలు జారి చేసింది. 2023 జనవరి 1 తేదీ నుంచి యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఏపీ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది.

ముఖ ఆధారిత హాజరు నమోదు
face recognition App on Google Play Store
author img

By

Published : Dec 31, 2022, 4:04 PM IST

Updated : Dec 31, 2022, 10:02 PM IST

Face recognition attendance: ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.... దానికోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఏపీ– ఎఫ్ఆర్ఎస్ యాప్‌గా తీసుకొచ్చిన మొబైల్‌ యాప్ ద్వారా జనవరి 2వ తేదీ నుంచి ముఖ హాజరు తప్పనిసరని పేర్కొంటూ.. సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. జీఐఎస్ సాంకేతికత ద్వారా పనిచేసే ఈ యాప్‌లో కార్యాలయానికి వచ్చిన తర్వాతే హాజరు నమోదు కానుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్‌ యాప్‌ ఆధారిత హాజరుపై మార్గదర్శకాలు

ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు నమోదును తప్పనిసరి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఓ యాప్‌ను రూపొందించింది. ఏపీ– ఎఫ్ఆర్ఎస్ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌తో పాటు ఏపీ సీఎఫ్ఎస్ఎస్ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచింది. 2023 జనవరి 2 తేదీ నుంచి యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఏపీ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా... మొబైల్‌ఫోన్లలో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది.

2023 జనవరి 2 తేదీ నుంచి ఏపీ– ఎఫ్ఆర్ఎస్ యాప్‌ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. ఉద్యోగులతో పాటు డీడీఓలకూ యాప్‌ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టాలని కార్యదర్శులు, విభాగాధిపతులు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జీఐఎస్ సాంకేతిక ద్వారా పని చేసే ఈ యాప్‌ సదరు ఉద్యోగి కార్యాలయానికి వచ్చిన అనంతరమే హాజరు నమోదు చేస్తుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఈ ముఖ ఆధారిత యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేస్తున్నారు.

Last Updated : Dec 31, 2022, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.