Extortion in the name of purchases in GHMC: పారిశుద్ధ్య కార్మికులకు అందించే రక్షణ వస్తువుల కొనుగోళ్లలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లు ఊడ్చే సఫాయన్న పేరుతో దోపిడీకి తెరలేపాలనుకుంటున్నారు. రక్షణ వస్తువులుగా కార్మికులకు ఇచ్చే సబ్బులు, కొబ్బరి నూనె, బూట్లు, చెప్పుల విషయంలో గోల్‌మాల్‌కు యత్నిస్తున్నారు. గుత్తేదారుకు బల్దియా చెల్లిస్తోన్న ధరకు, మార్కెట్లో ఆయా వస్తువులు లభిస్తున్న ధరకు భారీ వ్యత్యాసం ఉండటమే దీనికి నిదర్శనం.
మూడేళ్లకోసారి కేటాయింపులు: జీహెచ్‌ఎంసీ మూడేళ్లుగా పారిశుద్ధ్య కార్మికులకు పూర్తిస్థాయిలో రక్షణ వస్తువుల పంపిణీ చేయడంలేదు. ఇటీవల ధర్నా చేయడంతో.. వెంటనే టెండర్లు పిలిచారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు కలిపి మూడేళ్ల కోటాను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. అధికారులు నిర్ణయించిన ధరల ప్రకారం మూడేళ్లకు కలిపి 5 వేల మందికి రక్షణ వస్తువులను కొనుగోలు చేస్తే.. రూ.6.50 కోట్లు ఖర్చవుతుంది.
రేట్లు వారు ఎంత చెబితే అంత: మూడేళ్లకుగాను ఒక్కో కార్మికుడికి 4 లీటర్ల కొబ్బరినూనె, 72 సంతూర్ సబ్బులు, 3 జతల చెప్పులు, 3 జతల బూట్లు అందజేయాల్సి ఉంటుంది. కొబ్బరి నూనెకు రూ.2.22 కోట్లు, సబ్బులకు రూ.1.72 కోట్లు, చెప్పులకు రూ.80 లక్షలు, బూట్లకు రూ.1.70 కోట్లు వెచ్చించాలి. రిటైల్ మార్కెట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, బిగ్‌బాస్కెట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, హోల్‌సేల్ మార్కెట్ల ధరలను సరిచూడగా.. కొబ్బరి నూనెపై గరిష్ఠంగా రూ.62 లక్షలు, సబ్బులపై రూ.68 లక్షలు, చెప్పులపై రూ.80 లక్షలు, బూట్లపై రూ.80 లక్షలు కలిపి మొత్తంగా రూ.2.90 కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు తేలింది.
ఇవీ చదవండి: