ETV Bharat / state

'పోలీసులు అసలు నిందితులను వదిలేశారు' - yarapathineni srinivasarao fires on mla mahesh reddy news

గురజాల మాజీ ఎమ్మల్యే యరపతినేని శ్రీనివాసరావు.. ఎమ్మల్యే మహేష్​ రెడ్డిపై ధ్వజమెత్తారు. తెదేపా మాజీ సర్పంచ్ అంకులు హత్య కేసులో పోలీసులు... అసలు నిందితులను వదిలేశారని ఆరోపించారు.

ex mla yarapathineni fires on ycp govt
యరపతినేని శ్రీనివాసరావు
author img

By

Published : Jan 21, 2021, 1:03 PM IST

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇష్టారాజ్యంగా హత్యారాజకీయాలకు పాల్పడుతున్నా... పోలీసులు స్పందించటం లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకులు హత్య కేసులో అసలు దోషుల్ని వదిలేసి... వేరే వాళ్లను అరెస్టు చేశారని ఆరోపించారు. అంకులు హత్య కేసులో రాజకీయ కోణం లేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ చెప్పటాన్ని తప్పుబట్టారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో కోటేశ్వరరావు, కర్పూరపు వెంకట కోటయ్య వైకాపా నాయకులు కాదా అని ప్రశ్నించారు. అప్పిరెడ్డి అనే వైకాపా నేతను పోలీసులు కేసు నుంచి తప్పించారని ఆరోపించారు. దోమతోటి విక్రమ్ అనే తెదేపా దళిత కార్యకర్తని, నీలకంఠబాబు అనే వడ్డెర కులస్తుడిని హత్య చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పెదగార్లపాడులో ఇద్దరు మైనార్టీ మహిళలపై అత్యాచారం జరిగితే పోలీసులు కనీసం కేసు పెట్టలేదని ఆగ్రహించారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రక్తం తాగే రాక్షసుడిలా తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాసు మహేష్ రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని... పల్నాడుని ఆటవిక రాజ్యంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. అంకులు హత్యతో పాటు మిగతా కేసుల్లో అసలు నిందితులను అరెస్టు చేయకపోతే.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్ఛరించారు.

ఇదీ చదవండి:

తెదేపా నేత అంకులయ్య హత్యకు రూ.5 లక్షల సుపారీ: ఎస్పీ విశాల్ గున్నీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.