అక్రమాలు అరాచకాలతో వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. సీఎం జగన్ పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. వైకాపా తరఫున పోటీచేయనని చెప్పిన తిమ్మపురంలోని వ్యక్తుల ఇళ్లపై దాడి చేయడం అందుకు నిదర్శనమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం.. సీఎం జగన్ తీరే ఇందుకు కారణం: యనమల