తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో... గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆలపాటి రాజా, రైతులు నందివెలుగు సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలపాటి రాజాను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో రైతులు అడ్డుకున్నారు.
ఇవీ చదవండి..భగ్గుమన్న బెజవాడ: చంద్రబాబు అరెస్టు... విడుదల!