Employees Protest on GPS Cancellation in AP: జీపీఎస్ వద్దు.. ఓపీఎస్‌నే పునరుద్ధరించాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నేతలు నిరవధిక దీక్షలకు దిగారు. వారంలో.. సీపీఎస్ రద్దు చేస్తామని ఓట్లేయించుకున్న జగన్.. మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు.
Teachers Protests Against CPS in Andhra Pradesh: సీపీఎస్ స్థానంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌ను.. వెనక్కి తీసుకోవాలని సీపీఎస్ ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట.. యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షకు దిగారు. పింఛన్ ఉద్యోగుల హక్కు అని.. భిక్ష కాదంటూ నెల్లూరు శిబిరంలో ఉపాధ్యాయులు నినాదాలు చేశారు.
"వారంలో.. సీపీఎస్ రద్దు చేస్తామని ఓట్లేయించుకున్న జగన్.. మాట తప్పి మడమ తిప్పారు. పింఛన్ ఉద్యోగుల హక్కు.. భిక్ష కాదు. సీపీఎస్ స్థానంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌ను.. వెంటనే వెనక్కి తీసుకోవాలి." - ఆదినారాయణ, సీపీఎస్ ఉద్యోగ సంఘ నేత
Employees GPS Cancellation Issue in Andhra Pradesh: సీపీఎస్ కన్నా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానం వల్లే ఎక్కువ నష్టమని కర్నూలులో ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. కడప యూటీఎఫ్ కార్యాలయంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీపీఎస్ కోసం నాలుగున్నరేళ్లుగా అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"సీపీఎస్ కన్నా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానం వల్లే ఎక్కువ నష్టం. జీపీఎస్ కోసం నాలుగున్నరేళ్లుగా అనేక రూపాల్లో మేము ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదు." - విజయకుమార్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు
Employees Protests Against CPS in AP: విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు.. ఆందోళన చేపట్టారు. కొన్ని రాష్ట్రాల తరహాలోనే.. రాష్ట్రంలోనూ ఓపీఎస్‌ను పునరుద్ధరించి.. జగన్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబా పూలే పార్క్ వద్ద ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విజయనగరం కలెక్టరేట్ వద్ద దీక్షల్లో యూటీఎఫ్ నేతలు దుయ్యబట్టారు.
"కొన్ని రాష్ట్రాల తరహాలోనే.. రాష్ట్రంలోనూ ఓపీఎస్‌ను పునరుద్ధరించి.. జగన్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుతున్నాము. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కింది." - నాగమణి, యూటీఎఫ్ నాయకురాలు
Teachers Protests on GPS Cancellation in AP: కాకినాడలోనూ నిరవధిక దీక్షలు చేపట్టిన ఉపాధ్యాయులు.. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.