ETV Bharat / state

Employees Opposes GPS: 'సీపీఎస్ రద్దు చేయలి..లేకపోతే ఐక్యంగా ఉద్యమిస్తాం'

author img

By

Published : Jul 14, 2023, 10:26 AM IST

CPS Should be Abolished: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌ విధానాన్ని అంగీకరించేందుకు ఉద్యోగ సంఘాలు ససేమిరా అంటున్నాయి. ఈ పాలసీతో పెద్దగా ఉపయోగం ఉండదంటూ వ్యతిరేకిస్తున్న నేతలు.. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ అదే విషయాన్ని పునరుద్ఘాటించాయి. పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ అమలు చేయాలని మరోసారి డిమాండ్‌ చేశాయి.

Etv Bharat
Etv Bharat
జీపీఎస్​ను అంగీకరించేది లేదన్న ఉద్యోగ సంఘాలు

Employees Associations Opposes GPS : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌ విధానాన్ని అంగీకరించేందుకు ఉద్యోగ సంఘాలు ససేమిరా అంటున్నాయి. ఈ పాలసీతో పెద్దగా ఉపయోగం ఉండదంటూ వ్యతిరేకిస్తున్న నేతలు.. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ అదే విషయాన్ని పునరుద్ఘాటించాయి. పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ అమలు చేయాలని మరోసారి డిమాండ్‌ చేశాయి.

సీపీఎస్ రద్దు చేయకపోతే ఐక్యంగా ఉద్యమిస్తాం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన గ్యారెంటీ పింఛన్‌ స్కీమ్‌-జీపీఎస్‌ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని..ఉద్యోగ సంఘ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సీఎస్ జవహర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలో అభిప్రాయాన్ని వెల్లడించారు. సీపీఎస్ రద్దు చేయకపోతే ఐక్యంగా ఉద్యమిస్తామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో జీపీఎస్‌పై ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రాలేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. జీపీఎస్‌పై ఉత్తర్వులు ఇచ్చేముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని మళ్లీ రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి తీసుకురావద్దని ఆయన అన్నారు.

ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్లు : సకాలంలో జీతాలు, పింఛన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పింఛనుదారుల డీఏ, పీఆర్సీ బకాయిల్ని డిసెంబరు నాటికి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 2014 నాటికి సర్వీసులో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరించాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలను తెలంగాణతో సమానంగా పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు.

ఏఎన్​ఎమ్​లను క్రమబద్ధీకరించాలి : నీటి పారుదల శాఖలో 18 నెలలుగా జీతాల్లేక లస్కర్లు ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్య పరిష్కరించాలని ఏపీఎన్​జీఓ బండి శ్రీనివాసరావు కోరారు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్​ఎమ్​లను క్రమబద్ధీకరించాలన్నారు.

42 మందికి కారుణ్య నియమాకాల్లో ఉద్యోగాలు : ఉద్యోగులకు సంబంధించిన 461 డిమాండ్లలో 341 అంశాల్ని ఇప్పటికే నెరవేర్చామని సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో వెయ్యి42 మందికి కారుణ్య నియమాకాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.

" రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేశాం.. జీపీఎస్​ను తీసుకువస్తున్నాం అనే దానిలో గ్యారంటీ లేదు కాబట్టి ఈ పథకాన్ని మేము ఎటువంటి పరిస్థితిలో అమోదించలేమని చెప్పడం జరిగింది. " - హృదయరాజు, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు

" జీతాలు, పెంచన్లు ఒకటవ తేదీన వచ్చే విధంగా చేయాలని కోరాం. ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు విషయాన్ని ప్రస్తావించాం. కాంక్రీట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం చాలా సంతోషం. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో వచ్చే అనేక అలవెన్సులు జీతాలతో కలిపి ఇవ్వాలి." - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.