తెదేపా బాపట్ల పార్లమెంటు ఇన్ఛార్జిగా ఏలూరు సాంబశివరావు, అధ్యక్షురాలిగా పృథ్వి లతా, సెక్రటరీగా పల్లం సరోజిని ప్రమాణ స్వీకారం చేశారు. ఏలూరి సాంబశివరావుతో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యుడు కోవెలమూడి నాని, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, తెదేపా నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని.. పోలీసులు లేకపోతే ముఖ్యమంత్రితో సహా ఎవరూ ప్రజల్లో తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ వైకాపా నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు.
ఇదీ చదవండి
ప్రియురాలి శరీరాన్ని కట్టర్తో కట్ చేసి.. గోనెసంచిలో కుక్కి..!