గుంటూరు జిల్లా బాపట్లలోని మున్నాంవారి పాలెంలో ఎన్నికల కోడ్ను అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత రాత్రి గ్రామంలో తిరుపతమ్మ తిరునాళ్ళు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నేతలు భారీ ఎత్తున రెండు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. వాటికి పార్టీ రంగులతో కూడిన తోరణాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నేతలు యువతులుతో పాటలకు చిందులు వేయించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల నిబంధన ఏ ఒక్క అధికారికి గుర్తుకు రాలేదని స్థానికులు వాపోతున్నారు. తోపులాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారే తప్ప.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోలేదంటున్నారు.
ఇవీ చూడండి...