గుంటూరు జిల్లాలో పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గుంటూరు నగరపాలక సంస్థతో పాటు తెనాలి, రేపల్లె, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరు పురపాలక సంఘాల పరిధిలో 946 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 238 వార్డుల్లో 758 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బుధవారం జరిగే ఎన్నికల్లో 9,26,064 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
కలెక్టర్ వివేక్ యాదవ్ గుంటూరు, సత్తెనపల్లిలో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 3,740 మంది పోలీసు బందోబస్తును నియమించామని తెలిపారు. జిల్లాలో 124 అతి సమస్యాత్మక ప్రాంతాలు, 99 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
తెనాలి
తెనాలి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 40 వార్డులు ఉండగా.. 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 38 వార్డులకు గాను 106 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి