గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ మూడో రోజుకు చేరుకుంది. స్థానిక సాయి తిరుమల ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతోన్న పోటీల్లో వివిధ కళాశాలల నుంచి క్రికెట్ జట్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. ఈనాడు సంస్థ తమలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీస్తోందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఈనాడు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నామని క్రీడాకారులు తెలిపారు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
ఇదీ చూడండి: