ఎంపిక:
మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్నీ, అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది.
శిక్షణ, భృతి:
ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు Rs. 14,000, తరువాతి ఆరు నెలలు Rs.15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది.
ఉద్యోగంలో:
స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో Rs. 18,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో Rs. 20,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో Rs. 22,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఆన్లైన్లో మాత్రమే చేయాలి. https://ejs.eenadu.net/ ను క్లిక్ చేసి అప్లై చేయండి . దరఖాస్తు రుసుము Rs. 200 ఆన్లైన్లోనే చెల్లించాలి. దరఖాస్తు ధ్రువీకరణ నకలును అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి.
ఒప్పంద పత్రం:
స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూపు సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.
అర్హతలు :
- తేట తెలుగులో రాయగల నేర్పు
- ఆంగ్లభాషపై అవగాహన లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు
- ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన
- మీడియాలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష
- 23.01.2023 నాటికి 28కి మించని వయసు
- డిగ్రీ ఉత్తీర్ణత
ముఖ్య తేదీలు:
- నోటిఫికేషన్ : 31.10.2022
- ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు గడువు: 21.11.2022
- రాత పరీక్ష: 04.12.2022
- కోర్సు ప్రారంభం: 23.01.2023
- ఇక్కడ క్లిక్ చేయండి దరఖాస్తు నింపండి : https://ejs.eenadu.net/