ED Raids at KMC Construction Office: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయంలో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. ప్రివెంటింగ్ మనీలాండరింగ్ చట్టం 2002కింద ఈడీ ఈ దాడులను నిర్వహించింది. విక్రమ్ రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ తనిఖీలు నిర్వహించింది. కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబానికి చెందినది కాగా.. ప్రస్తుతం విక్రమ్‌రెడ్డితోపాటు మేకపాటి పృథ్వికుమార్ రెడ్డి, మేకపాటి శ్రీకీర్తి డైరెక్టర్లుగా ఉన్నారు.
విక్రమ్‌రెడ్డి కేఎంసీకి మాత్రమే కాకుండా.. కోల్‌కతాలోని జీఐపీఎల్ సంస్థ, మరో సంస్థ భారత్ రోడ్ నెట్‌వర్క్‌లోనూ విక్రమ్‌రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈడీ కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయంతో పాటు అక్కడ కూడా తనిఖీలను నిర్వహించింది. అయితే దాడులు నిర్వహించిన అనంతరం వెల్లడైనా అంశాలను ఈడీ ప్రకటించింది.
ED RAIDS : మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు..
అసలు విక్రమ్ రెడ్డి చేసిన కుట్రపూరిత నేరమెంటీ.. కేరళలో జాతీయ రహదారుల పనులను.. విక్రమ్‌రెడ్డి కాంట్రాక్టు తీసుకున్నారని ఈడీ వివరించింది. ఈ పనుల్లో నేరపూరిత కుట్రకు పాల్పడి.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను (NHAI) మోసగించారని సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా ఈడీ ప్రస్తుతం దాడులు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
2006-16 మధ్య పాలక్కడ్‌లో ఎన్‌హెచ్-47కి సంబంధించిన పనుల్లో రెండు ప్యాకేజీలను కోల్‌కతాలోని జీఐపీఎల్ చేపట్టిందని వివరించారు. అప్పుడు ఆ సంస్థ డైరెక్టర్‌గా విక్రమ్‌రెడ్డి వ్యవహరించినట్లు వెల్లడించారు. ఎన్‌హెచ్‌ఐఏని సుమారు రూ.102.44 కోట్ల రూపాయల మేర నేరపూరిత కుట్రకు పాల్పడి మోసగించారని ప్రకటించారు. జీఐపీఎల్, దాని సబ్ కాంట్రాక్టు సంస్థ అయిన కేఎంసీ ఎన్‌హెచ్‌ఏఐలోని కొందరు అధికారులు, ప్రాజెక్టు స్వతంత్ర ఇంజినీర్‌తో రోడ్డు ప్రాజెక్టు పూర్తయినట్లుగా మోసపూరితంగా ధ్రువీకరణ పత్రాన్ని పొందారని పేర్కోన్నారు.
'సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనక మోదీ హస్తం లేదు!'.. దీదీ కీలక వ్యాఖ్యలు
పూర్తయినట్లు ధృవీకరణ పత్రాం పొందడమే కాకుండా.. ఆ రోడ్డుపై టోల్ ఏర్పాటు చేసుకుని వాహనాదారుల నుంచి టోల్ ఫీజుల రూపంలో డబ్బు వసూలు చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా బస్‌బేలను పూర్తి చేయకుండానే.. అక్కడ ప్రకటన ప్రదేశాలను ఏర్పాటు చేశారని వివరించారు. ఆ ప్రకటన ప్రదేశాలను అద్దెకు కూడా ఇచ్చారని వివరాలను బహిర్గతం చేశారు. ఇలా చట్టవిరుద్ధంగా అద్దెకు ఇవ్వడం ద్వారా రూ.125.21 కోట్ల లబ్ధి పొందారని దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
చేయని పనులకు సంబంధించిన మొత్తాన్ని ఎన్‌హెచ్‌ఏఐకి జమ చేయకుండా జీఐపీఎల్.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. అందువల్ల జీఐపీఎల్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోని నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు 125.21 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు అధికారులు వివరించారు. జీఐపీఎల్‌లో కేఎంసీ వారికి ఉన్న 51 శాతం షేర్లను సరైన వాల్యుయేషన్ లేకుండా, ఎన్‌హెచ్‌ఏఐ నుంచి తగిన అనుమతులు తీసుకోకుండా బీఆర్‌ఎన్‌ఎల్‌కు అమ్మేసినట్లు గుర్తించినట్లు ప్రకటించారు. అందువల్ల కేఎంసీ బ్యాంకు ఖాతాల్లోని రూ.1.37 కోట్లను ఫ్రీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు.