ETV Bharat / state

e-Crop: రైతులు ఈ లాభాలు పొందాలంటే..'ఈ-క్రాప్​'లో పంట నమోదు తప్పనిసరి !

author img

By

Published : Sep 7, 2021, 10:20 PM IST

పంటల నమోదుకు సంబంధించి ఈ-క్రాప్ (e-Crop) ప్రక్రియ చాలా కీలకం. ప్రభుత్వపరంగా రైతులకు పథకాలు (Farmer Schemes), రాయితీలు అందాలంటే ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి. ప్రభుత్వం ఈ ప్రక్రియ నమోదును ఖరీఫ్ సీజన్ (kharif Session) నుంచి మరింత ఆధునీకరిస్తోంది. దీనివల్ల రైతులకు (Farmers) దీర్ఘకాలికంగా, శాశ్వతంగా భరోసా లభించే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.

'ఈ-క్రాప్​'లో పంట నమోదు తప్పనిసరి
'ఈ-క్రాప్​'లో పంట నమోదు తప్పనిసరి

ఈ ఏడాది ఖరీప్ సీజన్ (kharif Session) ఆశావహంగానే ప్రారంభమైంది. రాష్ట్రంలో 92.26 లక్షల ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణం కాగా..ఇప్పటివరకు మూడొంతుల నాట్లు పూర్తయినట్లు అంచనా. గుంటూరు జిల్లాలో ఈ సీజన్​లో (Session) 6.55 లక్షల ఎకరాల్లో ఈ-క్రాప్ (e-Crop) వివరాలు నమోదు చేయాలని అధికారులుకు లక్ష్యంగా విధించారు. కాగా..ఇప్పటి వరకు 4.65 లక్షల ఎకరాల్లో లక్ష్యాన్ని (Target) పూర్తి చేశారు.

ఏ పని తలపెట్టినా నమోదు తప్పనిసరి

గుంటూరు జిల్లాలోని 865 రైతు భరోసా కేంద్రాల్లో (Rythu Bharosa Centers) వ్యవసాయ, ఉద్యాన సహాయకులు రోజుకు 17 వేల నుంచి 20 వేల ఎకరాల ఈ క్రాప్ ప్రక్రియ నమోదు చేపడుతున్నారు. విత్తనాలు (Seeds), ఎరువులు, పంటల బీమా, పరిహారం, రాయితీలు, మార్కెటింగ్​ (Marketing) ఇలా అన్నదాతలు ఏ పని తలపెట్టినా ఈ -క్రాప్ నమోదు వివరాల అవసరం ఉంది. గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా రైతుల బయోమెట్రిక్ (Bio- Metric) ద్వారా ఇతర ఆధారాలను సేకరించి ఈ క్రాప్ బుకింగ్ (Crop Booking) ప్రక్రియను చేపడుతున్నారు. ఈసారి నమోదు అనంతరం గుర్తింపు పత్రాలను రైతులకు అందిస్తున్నారు.

పక్కాగా పంట వివరాలు

డిజిటల్ రశీదులు (Digital Receipts) ఎప్పటికప్పుడు అందించేలా ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు (Agriculture officers) , సహాయకులకు ఆదేశాలు జారీచేసింది. అన్ని డాక్యుమెంట్లను (Documents) అడిగి రైతులను ఇబ్బందులకు గురిచేయరాదని ఇప్పటికే సూచనలు జారీ చేశారు. పంట వేసిన ప్రతిచోటా ఈ -క్రాపింగ్ (e-cropping) నమోదు చేయాలని, పొలంలో ఏ పంట వేశారు? ఎవరు వేశారు ? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పంట వేశారన్న అంశాలను వ్యవసాయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలన (Ground Level verification) చేసి ఈ-క్రాపింగ్ వివరాలు (Cropping Details) నమోదు చేస్తున్నారు. పంటలు బీమా (Crop Insurance) చేయాలన్నా..,సున్నా వడ్డీకే రుణం (Zero Interest Loan) పొందాలన్నా..,పంటలు కొనుగోలు (Crop Purchase) చేయాలన్నా ఈ-క్రాపింగ్ అవసరమని అధికారులు చెబుతున్నారు.

వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఈ -క్రాపింగ్ నమోదు ప్రక్రియను ప్రభుత్వం (AP Government) వేగవంతం చేసింది. ఈ-క్రాపింగ్ విధానంపై (e-cropping Policy) రైతులకు అవగాహన (Awareness) కల్పించేందుకు ప్రచారం (Campaign) నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి

CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్

AP RAINS: రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.