ETV Bharat / state

"మా అమ్మను కిడ్నాప్ చేశారు.. ఇది ఎమ్మెల్యే ఆర్కే పనే" - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

duggirala mptc
ఎంపీటీసీ పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపణ
author img

By

Published : May 4, 2022, 4:35 PM IST

Updated : May 4, 2022, 6:23 PM IST

16:30 May 04

ఎమ్మెల్యే ఆర్కేపై ఎంపీటీసీ పద్మావతి కుమారుడు ఆరోపణలు

మా అమ్మను కిడ్నాప్ చేశారు.. ఇది ఎమ్మెల్యే ఆర్కే పనే

రేపటి దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. దుగ్గిరాల 2 వైకాపా ఎంపీటీసీ పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారంటూ పద్మావతి తనయుడు యోగేంధర్ నాథ్ ఆరోపించారు. వైకాపా తరపునే పోటీ చేసి గెలిచినా.. రేపటి ఎంపీపీ పదవికోసం రెబల్ అభ్యర్థిగా పద్మావతి బరిలో దిగుతారనే అనుమానంతో బలవంతంగా తీసుకెళ్లారని పద్మావతి తనయుడు ఆరోపించారు. తన తల్లిని ఎక్కడ దాచిపెట్టారో తెలియట్లేదని తెనాలి వైపు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు.

"ఎంపీపీ పదవిపై మాకు ఆసక్తి లేదు. నా తల్లిని ఎక్కడ దాచిపెట్టారో తెలియట్లేదు. నాకు, నా తల్లికి ప్రాణహాని ఉంది. ఇప్పటికే పలుమార్లు స్టేషన్‌కి పిలిచి మమ్మల్ని బెదిరించారు. వైకాపా నేతలు మమ్మల్ని అనేక అవమానాలకు గురి చేశారు. మాకేం జరిగినా ఎమ్మెల్యే ఆర్కే, దుగ్గిరాల ఎస్‌ఐ బాధ్యులు"

- యోగేంధర్‌నాథ్‌, ఎంపీటీసీ పద్మావతి కుమారుడు

ఇదీ చదవండి: తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్సీ వేధింపులే కారణమని ఆరోపణ!

Last Updated : May 4, 2022, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.