ETV Bharat / state

నేడు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక.. వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు పద్మావతి అపహరణ - నేడే దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక

Duggirala MPP Election: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక కాకరేపుతోంది. ప్రతిష్ఠ చాటుకోవాలని వైకాపా, పట్టు నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీలు..వ్యూహ, ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నాయి. ఎంపీపీ స్థానం బీసీ రిజర్వు కావటంతో తమదే పీఠమని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా... వైకాపాలో రెబల్సే ఆ పార్టీని దెబ్బతీస్తారని తెలుగుదేశం భావిస్తోంది. నేడు జరిగే ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

నేడు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక
నేడు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక
author img

By

Published : May 4, 2022, 3:50 PM IST

Updated : May 5, 2022, 3:55 AM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రసకందాయంగా మారింది. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం ఉండే నియోజకవర్గం అంటూ అధికార వైకాపా, నారా లోకేశ్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నియోజకవర్గం అంటూ ప్రతిపక్ష తెలుగుదేశం ఇక్కడ ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గత ఏడాది మండలంలో మొత్తం 18ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లోనూ, వైకాపా అభ్యర్థులు 8స్థానాల్లో, 1స్థానంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు.

జనసేన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినా, రాజకీయ వివాదాలు, ఇతరత్రా కారణాల చేత ఎంపీపీ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావటంతో....తెలుగుదేశం తరఫున గెలిచిన మహిళా అభ్యర్థి షేక్‌ జబీన్‌కు బీసీ-ఇ ధ్రువపత్రం ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటూ వచ్చిందని ఆ పార్టీ ఆరోపించింది. అప్రజాస్వామిక విధానాలతో పాటు అధికార అండతో పదవిని దక్కించుకోవాలని వైకాపా ప్రయత్నిస్తోందని తెలుగుదేశం ఎంపీటీసీలు చెబుతున్నారు

ఇదే సమయంలో అధికార పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు బీసీ మహిళల్లో వర్గపోరు వైకాపాకు తలనొప్పిగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని దుగ్గిరాల - 2 నుంచి గెలుపొందిన వైకాపా ఎంపీటీసీ పద్మావతి చెబుతుండడంతో ఆమె ఎన్నికకు హాజరుకాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారంటూ ఆమె తనయుడు యోగేందర్‌నాథ్ ఆరోపించారు. ఈ విషయంపైనే దుగ్గిరాల ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి పలుమార్లు స్టేషన్‌కి పిలిచి బెదిరించారని వాపోయారు. ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని అనేక అవమానాలకు అధికారపార్టీ నేతలు గురిచేశారని.. వాటిని భరించలేకే ఎంపీపీగా పోటీ చేద్దామనుకుంటున్నట్లు తెలిపారు.

మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆర్కే మాత్రం పదవి తమకే దక్కుతుందని గెలిచిన 8మందితోనే ఎన్నికకు వెళ్తామని చెబుతున్నారు. ఎస్​ఈసీతో పాటు డీజీపీ సూచనలతో ఎన్నికకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఎస్పీ అరిఫ్‌ హపీజ్‌ చెప్పారు. సుమారు 3వందల మందితో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద 144వ సెక్షన్‌ విధించినట్లు చెప్పారు.

ఇవాళ ముందుగా కో ఆప్షన్‌ సభ్యుని ఎన్నిక, తర్వాత ఇద్దరు ఉపాధ్యక్షులు, చివర్లో ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తారు. సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది. కాబట్టి ఎక్కువ పదవులు వారికే వచ్చే అవకాశం ఉంది. కానీ వైకాపా ఏం చేస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. పార్టీ ఆదేశాలకు కట్టుబడి వ్యవహరించాలంటూ తెలుగుదేశం తమ ఎంపీటీసీ అభ్యర్థులకు విప్‌ జారీ చేసింది. ఆ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రామ్‌ప్రసన్నకు అందచేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంపీటీసీలకు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లోనే క్యాంప్‌ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: దుగ్గిరాల ఎంపీపీ అభ్యర్థి కులాన్ని ధ్రువీకరించిన కలెక్టర్‌..

Last Updated : May 5, 2022, 3:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.