గుంటూరు జిల్లాలో 40 వేల మంది వలస కూలీలను గుర్తించినట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. వారందరినీ సొంతూళ్లకు పంపించే ప్రక్రియ గత 4 రోజుల నుంచి చేపట్టినట్లు వివరించారు. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాకు 800 బస్సుల్లో కూలీలు వెళ్లారని తెలిపారు. అలాగే మరో 200 బస్సులను కర్నూలు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఇతర రాష్ట్రాల కూలీలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా సంయుక్త కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారినే పంపిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కిట్ల సంఖ్య తక్కువగా ఉన్నందున వారిని పంపించేందుకు ఒకటి రెండు రోజులు సమయం పట్టొచ్చన్నారు.
ఇదీ చదవండి: