Drugs in the lives of young people: హైదరాబాద్ నగర శివారులోని ప్రముఖ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఐటీ కంపెనీలో కొలువు సంపాదించాడు. స్నేహితులతో కలసి చేసుకునే పార్టీలో మాదకద్రవ్యాలు వాడుతూ పోలీసులకు చిక్కాడు. చదువుల్లో ర్యాంకర్‌గా ప్రతిభ చాటిన కుమారుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడనే విషయం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. స్వలింగ సంపర్కుల యాప్‌లో సభ్యుడిగా చేరి నెమ్మదిగా ఇలా తప్పటడుగు వేసినట్టు కౌన్సెలింగ్ సమయంలో పోలీసులు గుర్తించారు.
3 నెలలుగా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నట్లు యువకుడి తల్లి చెప్పారు. ప్రైవేటు సంస్థలో ఉన్నతోద్యోగి. కుమారుడిని అమెరికా పంపే ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో ఊహించని షాక్. ఇటీవల గోవాలో చిక్కన డ్రగ్ స్మగ్లర్ల వద్ద యువకుడి ఫోన్ నంబరు దొరికిందంటూ నగర పోలీసుల నుంచి ఆ తండ్రికి ఫోన్‌కాల్. స్నేహితులతో కలసి గోవా వెళ్లినపుడు ఎల్‌ఎస్‌డీబ్లాట్స్ తీసుకున్నానని, ఏడాదిగా తరచూ వాటిని నుంచి తెప్పించుకొని వాడుతున్నట్టు వివరించాడని బాధితుడి తండ్రి తెలిపారు.
600-700 మంది: మాదకద్రవ్యాలకు దగ్గరై ప్రస్తుతం సైకాలజిస్టుల వద్ద కౌన్సెలింగ్ తీసుకుంటున్న యువకుల తల్లిదండ్రులను ‘ఈనాడు’ పలకరించినపుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. మత్తుకు అలవాటుపడిన బిడ్డల భవిష్యత్తుపై కన్నపేగు కలవర పడుతోంది. ఇటీవల నగర పోలీసులు, హెచ్‌న్యూ(హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్) దాడుల్లో గోవా కేంద్రంగా సాగుతున్న మాదకద్రవ్యాల సరఫరా బండారం బయటపడింది.
స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో 600-700 మంది మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్టు నిర్ధారించారు. ఏపీ, తెలంగాణల్లో సుమారు 10,000 మంది ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్, కొకైన్ వంటి వాటిని వాడుతున్నట్టు అంచనాకు వచ్చారు. నగరంలో 60-70 మంది పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. కొందరు అవగాహన లేక గంజాయి తీసుకోవడం నేరమా అని ప్రశ్నిస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
ఇవీ చదవండి: