గుంటూరులో 74 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన బామ్మ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ఉమాశంకర్ తెలిపారు. మంగాయమ్మను ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే పిల్లలిద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. వారికి తల్లిపాలిచ్చే అవకాశం లేకపోవటంతో అదే ఆసుపత్రిలో వేరే తల్లుల నుంచి సేకరించిన పాలను ఆహారంగా అందిస్తున్నారు. చిన్నపిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తల్లితో పాటు పిల్లల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీచూడండి.ప్రమాదంలో...కోనసీమ లంక గ్రామాలు