Diwali Special Sweets: దీపావళి పర్వదినాన ప్రతి ఒక్కరూ నోరు తీపి చేసుకుంటారు. పండగ రోజు కావటంతో మిఠాయి దుకాణాలు రద్దీగా మారాయి . దీపావళి రోజున తీపిని అందరికీ పంచుకునే సాంప్రదాయం ఉంటుంది. పండుగ రోజు ప్రజలను ఆకర్షించేందుకు స్వీట్ల దుకాణదారులు వెరైటీ మిఠాయిలు తయారు చేస్తున్నారు.
ఒంటి నిండా బంగారు ఆభరణాలు దరించి స్వీట్స్ విక్రయం: దానిలో భాగంగా కొంతమంది ఒక ముందుకేసి.. బంగారంతో మిఠాయిలు తయారు చేసి.. ప్రత్యేకతను చాటుకుంటున్నారు. విజయవాడలో 24 క్యారెట్ల బంగారంతో స్వీట్‌పై పూతగా పూసి.. విక్రయిస్తున్నారు. ఈ గోల్డ్ స్వీట్‌కు మంచి డిమాండ్ ఉందని యజమానులు చెబుతున్నారు. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి మరీ స్వీట్స్ విక్రయిస్తున్నారు.
గోల్డ్ స్వీట్ అదరహో: గోల్డ్ స్వీట్‌తో పాటు రకరకాల వెరైటీలతో మిఠాయి దుకాణదారులు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తుందని చెబుతున్నారు. దీంతో స్వీట్ల దుకాణాలన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి స్వీట్స్ తినలేదని.. గోల్డ్ స్వీట్స్ చాలా బాగున్నాయని కస్టమర్లు చెబుతున్నారు.
లండన్‌లో కన్నులపండువగా దీపావళి సంబరాలు - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు వంటకాలు
వెరైటీ స్వీట్స్‌తో ఆకట్టుకుంటూ: ప్రతి ఏడాది వెరైటీగా స్వీట్స్‌ను తయారు చేస్తుంటామని దుకాణదారులు తెలిపారు. బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సిబ్బంది మిఠాయిలను తయారు చేస్తుంటారని తెలిపారు. వీటితో పాటు సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే పాలతాళికలు, పూర్ణాలు లాంటి వంటకాలు చేసి నగరవాసులకి అందిస్తున్నారు.
రద్దీతో దుకాణాలు కళకళ: రకరకాల మిఠాయిలతో దుకాణదారులు పండుగను మరింత ప్రత్యేకంగా మార్చారని వినియోగదారులు చెబుతున్నారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకే క్వాలిటీ తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నామని దుకాణదారులు చెబుతున్నారు. వినియోగదారుల రద్దీతో.. విజయవాడలోని మిఠాయి దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి.
అంబరాన్నంటిన దీపావళి సంబరాలు - వీధుల్లో నరకాసుర వధ, విదేశాల్లోనూ తగ్గని జోరు
దీపావళి అంటే చెడుపై విజయం. లక్ష్మీదేవి పూజలు చేస్తారు. అందరూ పూజలో మిఠాయిలు నైవేద్యంగా ఉంచుతారు. దీపావళికి ప్రతి ఒక్కరూ తీపిని పంచి పండగ చేసుకుంటారని చెబుతున్నారు. దుకాణాల యజమానులు పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు నూతన వెరైటీలు తయారు చేస్తున్నారు. క్వాలిటీని మెయింటెన్ చేస్తూ తయారు చేస్తుండటంతో వినియోగదారులు వస్తున్నారని చెబుతున్నారు.
ఆనందం వ్యక్తం చేస్తున్న కస్టమర్లు: గోల్డ్ స్వీట్ చాలా బాగుందని.. గతంలో ఎప్పుడూ తినలేదని కస్టమర్స్ చెబుతున్నారు. నచ్చిన వెరైటీలు ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగకు అందరూ స్నేహితులకు, ఉద్యోగులకు గిఫ్ట్ ప్యాక్‌ల్లో స్వీట్స్ పంచుతుంటారు. దీని కోసం ఆకర్షణీయంగా ఉండే విధంగా డ్రైఫ్రూట్స్, స్వీట్స్‌తో గిఫ్ట్ ప్యాక్‌లు తయారు చేశారు. చాక్లెట్లతో తయారు చేసిన బొమ్మ చిన్నారులను ఆకర్షించింది. దీంతో విజయవాడ నగరంలోని మిఠాయి దుకాణాలు పండగ రద్దీతో కళకళలాడున్నాయి.
పేలుతున్న టపాసుల ధరలు - తగ్గేదేలే అంటున్న ప్రజలు