గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యటించారు. పట్టణ పరిధిలోని పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ మొదటి విడతలో కేటాయించిన 100 ఎకరాల లే అవుట్లను కలెక్టర్ పరిశీలించారు. మొదటి విడతలో ఒకే ప్రాంతంలో 100 ఎకరాలు లభ్యం కావడంపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అదే విధంగా రెండో విడత ఇళ్లస్థలాల పంపిణీలో అర్హులైన లబ్ధిదారుల కోసం అక్కడే మరికొంత భూమిని కొనుగోలు చేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం లింగంగుంట్ల వద్దనున్న 200 పడకల ప్రభుత్వ కొవిడ్ వైద్యశాలలో సందర్శించారు. అక్కడ అదనంగా మరో 50 బెడ్ల ఏర్పాటు పనులను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, తహశీల్ధార్ రమణా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
అనాథ మృతదేహాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు: నారా భువనేశ్వరి