గుంటూరులోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్ లో పోలింగ్ బూత్ వద్ద తెదేపా ఏజెంట్లు ఎక్కువ సమయం పోలింగ్ బూత్‌లోనే ఉన్నారని.. వైకాపా వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను కూడా పోలింగ్ బూత్‌లోకి అనుమతించాలని.. లేదంటే తెదేపా ఏజంట్లను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వైకాపా నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.
ఇదీ చదవండి: 'ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం.. స్వేచ్ఛగా ఓటేయండి'