ETV Bharat / state

మంత్రుల నివాస సముదాయం వద్ద డిస్​ ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు

author img

By

Published : Apr 9, 2020, 4:50 PM IST

కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు సరికొత్తగా తయారుచేసిన డిస్​ ఇన్ఫెక్షన్ టన్నెళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. నివాస ప్రాంగణాలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో పలువురు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. మంగళగిరిలోని రైన్ ట్రీ విల్లా సముదాయం వద్ద ఓ టన్నెల్​ను ఏర్పాటు చేశారు.

dis infection tunnels
dis infection tunnels

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని రైన్ ట్రీ విల్లా సముదాయం ముందు కొవిడ్-19 డిస్​ ఇన్ఫెక్షన్ టన్నెల్​ను సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్​స్టిట్యూషన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు నివాసం ఉండే ఈ అపార్టుమెంట్ వద్దకు ప్రజలు వివిధ పనులపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రక్షణ చర్యల్లో భాగంగా సొంతంగా తయారు చేయించి ఏర్పాటు చేసినట్లు సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్​స్టిట్యూషన్స్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీన్ని ప్రారంభించారు.

నీటిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం కలిపి నాజిల్ స్ప్రే ద్వారా టన్నెల్​లో పిచికారీ చేస్తారు. ఈ టన్నెల్‌లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తాయి. ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్లు శరీరం నుంచి తొలగిపోతాయని సిమ్స్ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా బాధితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.