Disha Act Not Implementing in AP: హత్యాచారం జరిగితే.. 7రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తి చేస్తామన్నారు. 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తవుతుందన్నారు. ప్రత్యేక కోర్టులు పెట్టి 21 రోజుల్లో శిక్షలు వేయిస్తామన్నారు..!కానీ, మూడున్నరేళ్లలో ఒక్క నేరస్థుడికీ ఆ తరహా శిక్షలు పడలేదు. ఎందుకంటే.. అసలు అలాంటి చట్టమే లేదు.! దిక్కూమొక్కూలేని దిశా చట్టానికి.. జగన్ అండ్ కో మూడున్నరేళ్లుగా చెవులు చిల్లులు పడేలా ప్రచార డప్పుకొట్టుకుంటోంది..! పార్లమెంట్‌లో మోదీ సర్కార్ ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ వైసీపీ ఎంపీలతో అనుకూలంగా ఓటేయించే జగన్.. ఒక్క దిశ చట్టాన్ని ఆమోదించుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. దిశ బిల్లు మహిళల భద్రత కోసమా? ప్రచారం కోసమా? ఇంతకీ దిశా బిల్లుకు మోక్షమెప్పుడు?..
Disha Act Not Implementing: ఇదీ వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న.. దిశా చట్టం అమలు తీరు.! సుచరిత హోంమంత్రిగా.. ఉన్నప్పుడు చెప్పిన మాటలివి. ఇప్పుడు హోంమంత్రి మారిపోయి కూడా దాదాపు రెండేళ్లవుతోంది. కానీ దిశా చట్టానికే.. అతీగతీ లేదు. సుచరిత హోంమంత్రిగా ఉన్నప్పుడు దిశ చట్టం అమలు ఎక్కడుందో.., తానేటి వనిత హోంమంత్రి అయ్యాక కూడా.. అక్కడే ఉంది. ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
నెల్లూరు జిల్లాలో ఓ మహిళను కాపాడిన దిశ యాప్
Disha Act in AP: మరి చట్టబద్ధతలేని దిశ చట్టంతో.. ఒరిగేదేంటి.? ఉపయోగం ఎవరికి ? అంటారా ? ఉపయోగం లేకేం.. వైసీపీ ప్రచారానికి దిశా చట్టం బాగానే ఉపయోగపడింది. మహిళ భద్రత గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు.. సీఎం మొదలుకుని వైసీపీ నేతలంతా దిశ చట్టం తెచ్చామంటూ.. ఊదరగొడతారు. చట్టబద్ధతలేని దిశ వల్ల ప్రయోజన లేదని తెలిసీ.. ప్రచారం చేసుకుంటూ పోతుతున్నారు.
AP Disha Act: తండ్రిలా ఆలోచించి 'దిశ' చట్టాలు తెస్తున్నాం అంటూ.. 2019 డిసెంబరు 13న దిశ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశడుతూ జగన్ ప్రకటించారు. తానేదో మహిళల రక్షణకు దిగొచ్చిన ఆపద్బాంధవుడిలా.. ప్రచారం చేసుకున్నారు. మూడున్నరేళ్లు గడిచినా చట్టరూపం దాల్చలేదు. దిశచట్టం.. అమలైపోతున్నట్లు, దాని కింద శిక్షలు కూడా పడినట్లు చేసుకునే ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. బిల్లులు చట్టరూపంలోకి తెచ్చుకోవడంలో లోపించింది.
మహిళల భద్రతకే సీఎం పెద్దపీట: హోంమంత్రి తానేటి వనిత
దిశ బిల్లులు చట్టంగా మారాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం, రాష్ట్రపతి సమ్మతి తప్పనిసరి. వీటిలోని.. అంశాలపై లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలు, అభ్యంతరాలకు.. జగన్ ప్రభుత్వం పంపిస్తున్న వివరణల పట్ల.. కేంద్ర మంత్రిత్వ శాఖలు.. సంతృప్తి చెందడంలేదు. సరైన మేధోమథనం చేయకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా హడావుడిగా తీసుకురావటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Disha Case judgment in AP: హైదరాబాద్ శివారులో 2019 నవంబరు 28న 'దిశ'.. హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇదే సమయంలో.. అసెంబ్లీలో దిశ బిల్లులు ప్రవేశపెట్టారు. ఈ తరహా నేరాల్లో 7రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లో శిక్షలు వేయించేలా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ రెండు బిల్లులు రూపొందించారు. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లులను.. 2019 డిసెంబరు 16న ఉభయసభల్లో ఆమోదించారు.
Disha Act Not Implementing: ఆ తర్వాత బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కేంద్రానికి పంపారు. బిల్లులో.. లోపాలన్నాయని ప్రత్యేక న్యాయస్థానాల బిల్లును కేంద్రం అప్పట్లోనే తిప్పి పంపింది. మరోబిల్లుపైనా అభ్యంతరాలు తెలిపింది. చేసేదేమీలేక.. 2020 డిసెంబరు 3న పాత బిల్లు స్థానంలో మరో బిల‌్లు రూపొందించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఐపీసీలోకొన్ని సెక్షన్లు జోడిస్తూ, ప్రస్తుతం నిర్దేశించిన శిక్షల్ని పెంచుతూ.. బిల్లులో సవరణలు చేశారు.
Disha Patrol Vehicles: దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
Disha Act: ఐతే.. ఇప్పటికే ఉన్న నిర్దేశిత శిక్షల కాలాన్ని ఎలా పెంచుతారు? ఐపీసీకి సవరణలు ఎందుకు?అంటూ కేంద్రం ప్రశ్నలు సంధించింది. లైంగిక నేరాల్లో.. శిక్షపడిన వారి పేర్లతో కాకుండా నిందితులందరి వివరాలతో.. రిజస్ట్రీ తయారీ అవసరం ఏంటని అని వివరణ అడిగింది. వీటికీ వైసీపీ ప్రభుత్వం సంతృప్తికర వివరణలు పంపలేక పోయింది. అందుకే మూడున్నరేళ్లవుతున్నా ఆ బిల్లులు.. ప్రచారానికి తప్ప దేనికీ పనికిరావడం లేదు.
Disha Case: పార్లమెంట్‌లో బీజేపీ తెచ్చే ప్రతీబిల్లునూ సమర్థించే వైసీపీ ప్రభుత్వం.. దిశ బిల్లులు ఎందుకు ఆమోదించుకోలేకపోతోందని మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి. మూడున్నరేళ్లు దాటినా దిశ బిల్లు చట్టరూపు దాల్చడం లేదంటే.. మహిళల రక్షణపై వైసీపీ సర్కార్ చిత్తశుద్ధి మాటల్లో తప్ప.. చేతల్లో శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి.