గుంటూరు నగరం పాలెంలో 'దిశ' మహిళా పోలీస్ స్టేషన్‌ను డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయనున్నామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 18 'దిశ' పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో వీలైనంత వరకు మహిళా సిబ్బందినే నియమించనున్నట్లు చెప్పారు. కేంద్రం చేసే 'దిశ' చట్టం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. గుంటూరు అర్బన్ జిల్లాను కమిషనరేట్‌గా మార్చే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా ఇప్పటికే సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:
దిశ కేసుల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక న్యాయస్థానాలు: డీజీపీ