వెండి తెరపై శ్రీహరి కరకు రూపం అందరికీ తెలుసు కానీ ఆఫ్ ది స్క్రీన్ ఆయనలోని కరుణ గురించి కొద్ది మందికే తెలుసు
కష్టం వచ్చిందయ్యా అంటూ ఇంటి తలుపు ఎవరు తట్టినా వారి కన్నీళ్లు తుడిచి పంపించిన మనసున్న మనిషి శ్రీహరి
తన కూతురు అక్షర పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు
గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడిపోతున్న నిరుపేదలకు అక్షర ఫౌండేషన్ ద్వారా తాగునీళ్లు అందించి జీవం పోశారు
శామీర్ పేట మండలం పరిధిలోని అనంతారం లక్ష్మాపూర్ లక్ష్మాపూర్ తండాల్లో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకున్నారు
2009 జూన్ 15వ తేదీన లక్ష్మాపూర్ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు శ్రీహరి మినరల్ వాటర్‌ను తీసుకెళ్లేందుకు 40లీటర్ల వాటర్ క్యాన్లను ఆయనే అందజేశారు పేద విద్యార్థులకు యూనిఫామ్స్ మధ్యాహ్న భోజన ప్లేట్లు వంటి ఎన్నో సహాయాలు చేశారు
ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ నుంచి చిన్నతనంలోనే హైదరాబాద్ లోని బాలానగర్ కు వచ్చి స్థిరపడ్డారు
అందుకే శ్రీహరి నోట తెలంగాణ మాండలికం పలికేది
సినీ పరిశ్రమలో స్టంట్ మ్యాన్‌గా కెరీర్ ప్రారంభించి విలన్‌గా కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా సత్తాచాటారు రియల్ స్టార్ బిరుదును సగర్వంగా అందుకున్నారు
అలాంటి శ్రీహరి ఉన్నట్టుండి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు ముంబైలో ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన రాంబో రాజ్ కుమార్ సినిమాలో నటిస్తుండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు
వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స చేస్తుండగానే శ్రీహరి ప్రాణాలు కోల్పోయారు
శ్రీహరి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ను కోల్పోయింది లక్ష్మాపూర్ అనంతారం గ్రామాల ప్రజలు తాము దేవుడిని కోల్పోయామని రోదించారు
కష్టాల్లో ఉన్నామని ఫోన్ చేస్తే వెను వెంటనే శ్రీహరి ఏవిధంగా స్పందించేవారో దర్శకుడు బాబీ చెప్పిన ఒక ఉదాహరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
ఈ వీడియో చూసిన వారంతా శ్రీహరి నిజంగానే రియల్ స్టార్ అని కీర్తిస్తున్నారు
- " class="align-text-top noRightClick twitterSection" data="">