గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని సబ్ జైల్ను కోస్తా రీజియన్ జైల్ల శాఖ అధికారి డీఐజీ ఐ.శ్రీనివాస్ తనిఖీ చేశారు. జైల్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రతి జిల్లాలో ఖైదీల కోసం ఒక కొవిడ్ ప్రత్యేక జైల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖైదీలకు కరోనా పాజిటివ్ వస్తే ఆ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. తమ పరిధిలోని 7 జిల్లాల్లో ఒక ఖైదికి, ఒక జైల్ సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. సిబ్బంది కొరత ఉన్న చోట త్వరలోనే ఖాళీలు పూరించనున్నట్లు పేర్కొన్న ఆయన ఇప్పటికే 78 మంది శిక్షణ పొందుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఖైదీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు.
ఇవీ చూడండి...