గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెంలోని ప్రభుత్వ ఇసుక పాయింట్ వద్ద ఎంఐఎం పార్టీ సభ్యులు ధర్నాకు దిగారు. గత నెల 22న ఒక ట్రక్కు ఇసుక బుక్ చేస్తే ఇప్పటి వరకూ రాలేదని.. అధికారులను అడిగితే స్పందన లేదని ఎంఐఎం సభ్యులు పేర్కొన్నారు.
రూ. 2వేలు లంచమిచ్చే వారికే అధికారులు ముందుగా ఇసుక సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమ మార్గంలో ఇసుకను అమ్ముకుంటున్నారని అన్నారు. ఇటీవల ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లటంతో ఆయనే స్వయంగా వచ్చి అధికారులను హెచ్చరించారని.. అయినా వారి పద్ధతి మాత్రం మారడం లేదని ఎంఐఎం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇసుక లేక శాలిమ్ నగర్ లోని బిలాల్ మసీదు మరమ్మత్తులు మధ్యలోనే ఆగిపోయిందన్నారు. అధికారుల తీరుపై ఎంఐఎం సభ్యులు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు..