రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో శ్రీవిద్య మహాయాగం నిర్వహించాలని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి నిర్ణయించారు. అందుకు నిరాకరించిన పోలీసులు.. యాగం కోసం అక్కడకు తీసుకొచ్చిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా రాజధాని ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్ అన్నారు.
శ్రీవిద్య మహాయాగానికి అనుమతులు నిరాకరణ - గుంటూరు తాజా వార్తలు
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో శైవ క్షేత్ర పీఠాధిపతి తలపెట్టిన శ్రీవిద్య మహాయాగానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని తుళ్లూరు సీఐ పేర్కొన్నారు.
శ్రీవిద్య మహాయాగానికి అనుమతులు నిరాకరణ