ETV Bharat / state

పోలీసుల పహారాలో ఇళ్ల కూల్చివేత.. ఆందోళనలో స్థానికులు

గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిర్మాణాల పేరిట కొన్ని ఇళ్లనుల అధారులు కూల్చివేశారు. బాధితులకు తెలుగుదేశం, వామపక్షాల నేతలు మద్దతుగా నిలిచారు

Demolition of houses at Atmakur
ఆత్మకూరులో ఉద్రిక్తత
author img

By

Published : Mar 22, 2021, 11:46 AM IST

Updated : Mar 23, 2021, 5:37 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. అక్రమ నిర్మాణాల పేరిట కొన్ని నివాసాలను అధికారులు ప్రొక్లెయిన్లతో కూల్చేశారు. బాధితులు అడ్డుకుంటున్నా.. పోలీసుల సాయంతో నిలువరించి మరీ పడగొట్టేశారు. కేసు న్యాయస్థానంలో ఉండగానే కూల్చివేతలకు ఒడిగట్టారని బాధితులు వాపోయారు. 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉంటున్న తమకు స్థలాలు కేటాయించకుండా ఎలా తొలగిస్తారని ఇళ్లు ఎలా తొలగిస్తారని ఆందోళనకు దిగారు. బాధితులకు తెలుగుదేశం, వామపక్షాల నేతలు మద్దతుగా నిలిచారు. ప్రత్యామ్నాయ స్థలాలు చూపిన తర్వాతే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదు

ఇళ్లు ఖాళీ చేయాలని వచ్చిన నోటీసుల గురించి చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్దకు వెళితే, తమను కనీసం కార్యాలయం లోనికి రానివ్వలేదని కొందరు బాధితులు ఆరోపించారు. ‘మీ గ్రామంలో నాకు ఓట్లు వేయలేదు. మీరు ఏ సమస్యతోనూ నా దగ్గరకు రావొద్దు’ అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారంటూ ఆయన కార్యాలయ సిబ్బంది తమతో అన్నారని బాధితులు వాపోయారు.

ఇళ్ల కూల్చివేతపై హైకోర్టు స్టే

ఆత్మకూరులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు 3 వారాలపాటు స్టే విధించినట్లు తెదేపా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బాధితులు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారన్నారు.

ఆత్మకూరులో ఇళ్ల కూల్చివేత

ఇదీ చూడిండి: రాష్ట్రంలో ఒక్కరోజే మూడు హత్యలు

Last Updated : Mar 23, 2021, 5:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.