గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకును అప్రతిష్ఠపాలు చేయొద్దని.. బ్యాంక్ ఛైర్మన్ సీతారామాంజనేయులు అన్నారు. బ్యాంక్ లో జరిగిన కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ధూళిపాళ్ల నరేంద్ర శిష్యుడు నాగరాజేనని అన్నారు. అతడిని తప్పించేందుకు ధూళిపాళ్ల ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకుపై నిరాధారమైన ఆరోపణలు చేయటం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వంలో వినుకొండ సొసైటీలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదని నరేంద్రను ప్రశ్నించారు.
ఇదీ చదవండి: బీసీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడికి దేహశుద్ధి