గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో తండ్రి, కుమార్తె మృత్యువాతపడ్డారు. మేడికొండూరు పోలీసులు ప్రమాద వివరాలను వెల్లడించారు.
అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన కొమ్మవరపు అల్లాయ శాంతమ్మ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె శిరీష గుంటూరులోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. శిరీషను తీసుకొని అల్లయ్య ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి తాళ్లచెరువు బయల్దేరాడు. మేడికొండూరు వద్ద వెనక నుంచి వస్తున్న లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ అక్కడి నుంచి వెళ్లిపోగా.. పోలీసులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: