ETV Bharat / state

Culprits Arrest: బాలికతో వ్యభిచారం కేసు.. మరో 11మంది అరెస్టు

Culprits arrested in minor rape case: గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో.. తాజాగా 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తల్లిలేని ఆ బాలికను మాయమాటలతో ఓ మహిళ తనవెంట తీసుకెళ్లి.. బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ కేసులో ఇప్పటివరకు 61మంది అరెస్టయ్యారు.

culprits arrested in minor rape case
బాలిక అత్యాచారం కేసులో నిందితులు అరెస్టు
author img

By

Published : Feb 15, 2022, 10:41 PM IST

Culprits arrested in minor rape case: గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో.. తాజాగా 11 మంది నిందితులను అరండల్​పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 61 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ మాయమాటలు చెప్పి బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అభినందించారు.

అసలేం జరిగింది..

rape accused arrest: బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో మరో అయిదుగురిని గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా బారిన పడటంతో ఆ బాలికతో పాటు ఆమె తల్లి గతేడాది జూన్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ బాలిక బాగోగులు తండ్రి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పరిచయమైన ఓ మహిళ కరోనా పూర్తిగా నయమయ్యేందుకు నాటు వైద్యం చేయిస్తానని ఆ బాలిక తండ్రికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన తండ్రి తన కుమార్తెను ఆ మహిళ వెంట పంపారు. కరోనా తగ్గిపోయాక సదరు మహిళ ఆ బాలికను వ్యభిచారంలోకి దింపింది.

ఇదీ చదవండి:

rape accused arrest: బాలికతో వ్యభిచారం కేసులో మరో అయిదుగురి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.