ETV Bharat / state

"ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ లవ్" - దండలు మార్చుకుని దారుణంగా చంపేశాడు! - LOVER KILLED HIS GIRLFRIEND

ప్రియుడి కోసం ఇల్లు వదిలి వెళ్లిన బాలిక - స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం - పెళ్లికి ఒత్తిడి తేవడంతో హత్య

Lover Raped his Girlfriend and Killed in Hyderabad
Lover Raped his Girlfriend and Killed in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 9:14 AM IST

Lover Raped his Girlfriend and Killed in Hyderabad : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ బాలిక నమ్మింది. అతడి కోసం ఇల్లు వదిలి వెళ్లింది. అత్యాచారానికి పాల్పడిన అతడిని పెళ్లి కోసం బాలిక ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను చంపేసి నిర్మానుష్య ప్రాంతంలో చెత్తకుప్పల్లో విసిరేశాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడితోపాటు సహకరించిన స్నేహితుడు, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతి, ఎస్సై వెంకటేశ్వర్లు కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. మియాపూర్​కు చెందిన దంపతుల కుమార్తె(17) ఇంటర్‌ పూర్తి చేసి ఖాళీగా ఉంటోంది. ఏడు నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్‌ వాయించే ఓ వ్యక్తి విఘ్నేశ్‌ అలియాస్‌ చింటూ(22)తో పరిచయం ప్రేమగా మారింది. అక్టోబరు 20న ఆమె ఇల్లు వదిలి ఉప్పుగూడ వెళ్లింది.

తలను గోడకు కొట్టి చంపేశాడు : చింటూ ఛత్రినాకలో ఉండే తన స్నేహితుడు సాకేత్‌ ఇంటికి బాలికను తీసుకెళ్లాడు. సాకేత్‌కు వివాహమైంది. ఇల్లు చిన్నదవడంతో నలుగురు ఉండడం సాధ్యం కాలేదు. దీంతో అందరూ మీర్‌పేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. బాలిక తన స్నేహితులతో ఉంటున్నానని తల్లి, సోదరికి సమాచారం ఇచ్చింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించిన చింటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఆమె ఒత్తిడి తేగా అద్దె గదిలోనే దండలు మార్చుకున్నారు. ఇలా కాదని పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో జరగాలనగా అతడు తప్పించుకుంటూ వచ్చాడు. ఈ సమయంలోనే బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో మరొకరితో మాట్లాడుతోందని అనుమానించి ఈ నెల 8న గొడవ పడి తలను గోడకు కొట్టి చంపేశాడు. అనంతరం సాకేత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీశైలం జాతీయ రహదారి తుక్కుగూడ సమీపంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిశ్రమ తుక్కులో మృతదేహాన్ని పడేశారు. ఎవరికి కనిపించకుండా చెత్తతో కప్పేసి వెళ్లిపోయారు.

మేనమామ కాదు మానవ మృగం - తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం

ఎలా దొరికాడంటే : ఈ నెల 8 వరకు బాలిక తరచూ తల్లితో ఫోన్‌లో మాట్లాడేది. తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ అయింది. చింటూ ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బాలిక తన దగ్గరలేదని, ఫోన్‌ పనిచేయట్లేదు, మీ ఇంటికి వచ్చిందా? అని అడిగాడు. రెండు రోజులు గడిచినా కుమార్తె రాకపోవడంతో తల్లిదండ్రులు 10న మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింటూను పోలీసులు విచారణకు పిలవగా వస్తున్నానని చెప్పి రెండు రోజుల తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహం తరలించడానికి సహకరించిన సాకేత్, అతని భార్య కల్యాణిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రాణాలతో ఉందో? లేదో? తెలియకుండానే అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు

తిరుపతి జిల్లాలో దారుణం - చాక్లెట్​ ఇప్పిస్తానని మూడున్నరేళ్ల బాలికపై హత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.