గుంటూరులో వినాయక విగ్రహాల విక్రయాలపై నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి రోడ్డులోని ఐడీ ఆసుపత్రి వద్ద కొందరు వినాయక విగ్రహాలు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకుని విగ్రహాలను బలవంతంగా వాహనాల్లో తీసుకెళ్లారు. వినాయక విగ్రహాల విక్రయానికి అనుమతి లేదంటూ చెత్త తరలించే ట్రాక్టర్లో ఉంచి తరలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులతో విగ్రహాలు అమ్ముకునే వారు వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి: తెదేపా నాయకురాలు బొల్లినేని జ్యోతిశ్రీకి మరోసారి సీఐడీ నోటీసులు