ETV Bharat / state

'నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి' - సీపీఎం మధు తాజా వార్తలు

వరదలతో నష్టపోయిన గుంటూరు జిల్లా గుండిమెడ, చిర్రావూరు రైతులను సీపీఎం మధు పరామర్శించారు. పాడైన పంటపొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతలందరికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

cpm madhu
గుండిమెడ, చిర్రావూరులో సీపీఎం మధు పర్యటన
author img

By

Published : Oct 19, 2020, 5:22 PM IST

కృష్ణా నది వరదల వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావంతో నీటమునిగిన తాడేపల్లి మండలం గుండిమెడ, చిర్రావూరులోని పంట పొలాలను పరిశీలించారు.

అక్కడి ప్రైవేటు విశ్వవిద్యాలయం అక్రమ నిర్మాణాల వల్ల నీళ్లు ఎక్కడికక్కడ నిలిచి తమ పంట పొలాలు మునిగాయని రైతులు మధుకి చెప్పారు. ఈ విషయమై కళాశాల యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లగా.. వారిని సెక్యురిటీ సిబ్బంది అడ్డగించారు. దీంతో ఆగ్రహించిన నేతలు.. మధు కళాశాల గేటును నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. ఈనెల 21 లోపు కాలువలకు అడ్డంగా నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ఆడపిల్లగా పుట్టింది... మగరాయునిగా బతికింది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.