రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్న రోజే అన్ని పార్టీల నాయకులు ఆమెను కలిసినట్లు సీపీఐ రామకృష్ణ చెప్పారు. మూడో తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని.. రెండో తేదీ రాత్రి ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఎన్నికలకు ప్రచారం నిర్వహించుకునేందుకు నాలుగు రోజులు మాత్రమే వ్యవధి ఇవ్వడం సరైనది కాదని అన్నారు. సీఎం జగన్‌కు అన్నిచోట్ల ఆయనే గెలవాలనే పిచ్చి పట్టిందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్