మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ... అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నిరాహార దీక్షలు తిరిగి ప్రారంభిస్తున్నామని గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కార్యాలయాల్లో నిరసన దీక్షలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :